DELHIలో డెంగ్యూ

న్యూఢల్లీ, ఆగస్టు 8, (ఇయ్యాల  తెలంగాణ ):దేశ రాజధాని ఢల్లీిలో డెంగ్యూ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రోజురోజుకీ వ్యాప్తి వేగవంతమవుతోంది. గత వారం రోజుల్లోనే 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధాని ఢల్లీిలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 348 కి చేరింది. అందులోనూ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢల్లీి పరిధిలోని వెస్ట్‌, సౌత్‌, నజఫ్‌గఢ్‌ జోన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదేళ్లలో ఆగస్టు 6 నాటికి తొలిసారి 175 డెంగ్యూ కేసులు నమోదుకాగా.. ఆగస్టు తొలివారంలో తొలిసారి వందకు పైగా డెంగ్యూ కేసులు రికార్డ్‌ కావడం ఢల్లీి ప్రజల్ని కంగారు పెడుతోంది.మరోవైపు.. పరీక్షల కోసం పంపిన 20 శాంపిల్స్‌లో 19 ‘తీవ్రమైన’ టైప్‌ 2 డెంగ్యూ స్ట్రెయిన్‌ను కనుగొనడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ విజృంభణతో ఢల్లీి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అప్రమత్తమయ్యింది. ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తోంది. డెంగ్యూతోపాటు సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ఢల్లీి ప్రభుత్వం, మునిసిపల్‌ కార్పొరేషన్‌ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గత నెలలో భారీ వర్షాలు, వరదలు ఢల్లీిని ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని షేక్‌ అయింది.వరదల కారణంగా ఢల్లీిలోని పలు ప్రాంతాలు రోజుల తరబడి నీటిలోనే మునిగిపోవడంతో దోమల ఉత్పత్తి పెరిగింది. ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాలను బురద భయం వెంటాడుతోంది. అదే సమయంలో.. మున్సిపల్‌ సిబ్బంది కూడా సమ్మె చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇక.. ప్రస్తుత డెంగ్యూ కేసుల సంఖ్య గత ఆరేళ్లలోనే అత్యధిక కేసులుగా లెక్కలు చెప్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన 348 డెంగ్యూ కేసులతో పోల్చితే.. ప్రస్తుత పరిస్థితి తీవ్రమైనదిగా చెప్తున్నారు అధికారులు. ఇక.. 2015లో తీవ్రస్థాయిలో డెంగ్యూ ఢల్లీిని దడదడలాడిరచింది. అప్పట్లో వేలల్లో కేసులు నమోదు కాగా.. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....