COUNSELLING తేదీలు ఖరారు

విజయవాడ, ఆగస్టు 28, (ఇయ్యాల తెలంగాణ );విద్యాసంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఉన్నత విద్యామండలి వివిధ సెట్స్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. 2023`24 విద్యా సంవత్సరానికి పలు సెట్స్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంటెక్‌, ఎంఫార్మసీల్లో అడ్మిషన్ల కోసం పీజీ ఈసెట్‌ కు వచ్చే నెల 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ను సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి, పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పించే పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ ను సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. బీపీఈడీ, యూజీడీ, పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే పీఈసెట్‌కు సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్‌ కు సెప్టెంబర్‌ 26న కౌన్సెలింగ్‌ జరగనుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ఎడ్‌సెట్‌ కు సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి, ఏపీ ఈఏపీ సెట్‌ లో నాన్‌ ఎన్‌ఆర్‌ఐ, క్యాట్‌ బీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ తెలిపారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

ఐసెట్‌ ` సెప్టెంబర్‌ 6(ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు)

పీజీ ఈసెట్‌ ` సెప్టెంబర్‌ 10 (ఎంటెక్‌, ఎంఫార్మసీల్లో అడ్మిషన్లు)

పీజీ సెట్‌ `సెప్టెంబర్‌ 11(పీజీ కోర్సులకు ప్రవేశాలు)

పీఈసెట్‌` సెప్టెంబర్‌ 17(బీపీఈడీ, యూజీడీ, పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు)

లాసెట్‌ ` సెప్టెంబర్‌ 26(3 ఏళ్లు, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్లు)

ఎడ్‌సెట్‌ ` సెప్టెంబర్‌ 30(బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు)

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....