చిక్కడపల్లిలో Gold దోపిడి

హైదరాబాద్, ఆగస్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలతో నగర వాసులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల జరిగిన చందానగర్‌ ఖజానా జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దీనిని మరువక ముందే.. కొన్ని రోజుల క్రితం కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో ఎంఐజీ 14లో నివాసముంటున్న రిటైర్డ్‌ తహసీల్దార్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. తహసీల్దార్‌ ఇంట్లో దొంగ ముఠా ప్రవేశించి భారీగా బంగారు ఆభరణాలను అపహరించారు. తాజాగా శుక్రవారం (ఆగస్ట్‌ 15) తెల్లవారుజామున నగరంలో మరో దొంగతనం జరిగింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోని ఓ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చిక్కడపల్లిలో నివాసముంటున్న రిటైర్డ్‌ ఉద్యోగి నారాయణ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 36 తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై బాధితుడు నారాయణ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల ముఠాను చేధించి అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....