Charminar  భాగ్యలక్ష్మే –  మైసమ్మ

హైదరాబాద్, జూలై 20  (ఇయ్యాల తెలంగాణ) :నిత్యం వేలాదిమంది భక్తులతో కళ కళలాడుతూ అంద రూ దర్శించుకోవాలనే తపన ఉన్న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయం కులీకుతుబ్‌షాహి కాలం నుంచే ప్రసిద్దిగాంచింది.ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా చెప్పుకునే చార్మినార్‌ అమ్మవారు అత్యంత మహిమలు కలిగిన తల్లిగా భక్తుల అందరికి తన అభయహస్తాన్ని అందిస్తోంది.చార్మినార్‌ నిర్మితం కాకమునుపు నుంచే ఇక్కడ పూజలు అందు కునే పవిత్ర రాయి ఉండేదని అందరూ అంటుంటారు. అనంతరం చార్మినార్‌ వెలసిన తరువాత నుంచి నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారంగా నిలు స్తున్నది.కాగా భాగమతి కాలం నుంచి కూడా ఈ దేవాల యానికి ప్రసిద్దిగాంచినట్లు చెబుతుంటారు.

ఒకనాడు చార్మినార్‌ మైసమ్మగానే పూజలందుకున్న చార్మినార్‌ అమ్మ వారు ఈరోజు భాగ్యలక్ష్మీ మందిరంగా పూజలందు కుంటుంది. 1960 వసంవత్సరం నుంచి ప్రసిద్దిగాంచిన ఈ దేవాలయంలో కోరిన వారి కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతుంది.అమ్మ స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ లక్ష్మీ రూపం లో చూస్తారు కావున కాలక్రమేణ ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు భాగ్యలక్ష్మీ మందిరంగా వెలుగొందుతుం ది.బోనాల ఉత్సవాలకు పాతనగరంలోని వివిద ప్రాంతాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తారు. బోనాల ఉత్సవాలతో పాటు,ప్రతి ఏటా దీపావళి సంబరా లు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఈ ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలు నిర్వహిస్తారు.ఇక్కడ ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించడం విశేషం.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....