Census లెక్కల Notification విడుదల

న్యూఢిల్లీ, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనాభా లెక్కల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, మొదటి దశలో ఇండ్ల గణన కోసం అడిగే 33 ప్రశ్నల జాబితాను వెల్లడించింది. డిజిటల్ పద్ధతిలో జరగనున్న ఈ భారీ ప్రక్రియ కోసం యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. తొలి దశలో విÖ ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతులపై దష్టి సారించనున్నారు.

👉 సర్వేయర్లు అడిగే ప్రశ్నల జాబితా ఇలా ఉంది

👉ఇంటి నిర్మాణం: ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్‌కు వాడిన పదార్థాలు ఏంటి?

👉 నివాస వివరాలు: ఇంటి సంఖ్య, ఇంటి యాజమాన్య స్థితి, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య.

కుటుంబ పెద్ద వివరాలు: యజమాని పేరు, వారు షెడ్యూల్డ్ లేదా ఇతర వర్గాలకు చెందినవారా అనే సమాచారం.

కనీస వసతులు: తాగునీటి వనరు, నీటి లభ్యత, కరెంటు సౌకర్యం, మరుగుదొడ్డి రకం, డ్రైనేజీ వ్యవస్థ వివరాలు.

వంటగది: వంటకు వాడుతున్న ఇంధనం , వంటగది సౌకర్యం ఉందా లేదా?

డిజిటల్ ఆస్తులు ? ఇతర వస్తువుల వివరాలు

రేడియో` ట్రాన్సిస్టర్, టెలివిజన్.

ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్‌టాప్, కంప్యూటర్.

మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ వివరాలు

సైకిల్, స్కూటర్, కారు లేదా వ్యాన్ వివరాలు.

ప్రధానంగా వినియోగించే తణధాన్యాల వివరాలు

 👉 ఎంతమందికి ఒక సర్వేయర్?

ఈ బహత్తర కార్యాన్ని నిర్వహించడానికి భారత రిజిస్టార్ జనరల్ కఠిన నిబంధనలను రూపొందించారు:

సర్వేయర్లు: 1990 జనాభా లెక్కల చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, ప్రభుత్వ గుమస్తాలు, స్థానిక అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమిస్తారు.

పని భారం: ప్రతి సర్వేయర్‌కు 700 నుండి 800 మంది జనాభాను లెక్కించే బాధ్యత అప్పగిస్తారు.

పర్యవేక్షణ: ప్రతి ఆరుగురు సర్వేయర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. అత్యవసర పరిస్థితుల కోసం 10శాతం అదనపు సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతారు.

అధికారులు: జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, మేజిస్టేట్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....