Car బీభత్సం? ఇద్దరికి గాయాలు !

హైదరాబాద్‌, జూలై 31 (ఇయ్యాల తెలంగాణ) : జూబ్లీహిల్స్‌ చెక్పోస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్‌ విద్యార్థి సాకేత్‌ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్‌ చేశాడు. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు నుంచి కృష్ణానగర్‌ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది. కారు ఫుట్‌ పాత్‌ పైకి చేరుకుని చెట్లతో పాటు.. అక్కడున్న టెలిఫోన్‌ స్ధంభంపై కెక్కి అమాంతంగా కారు బోల్తాపడిరది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్‌ చేస్తున్న సాకేత్‌ రెడ్డితో పాటు.. అతని మిత్రుడికి గాయాలయ్యాయి. కారులోపల ఇరుక్కుపోయిన ఇద్దర్నీ స్ధానికులు బయటకు వెలికితీశారు. కారు డ్రైవర్‌ సాకేత్‌ రెడ్డికు పోలీసులు  బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్లుగా నమోదైంది. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దర్నీ జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....