BUS డ్రైవర్‌ పై దాడి ఘటన వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు

నెల్లూరు అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ): కావలి వద్ద కొందరు అనుమానిత వ్యక్తులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పై దాడి చేయడాన్ని సంస్థ ఎం.డి.  సిహెచ్‌. ద్వారకా తిరుమలరావు తీవ్రంగా ఖండిరచారు. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులుపై చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెంగుళూరు నుండి విజయవాడ వస్తున్న  సూపర్‌ లగ్జరీ బస్సు డ్రైవర్‌  బి.ఆర్‌.సింగ్‌ పై టీఎన్‌ 9 సి  1612 నంబర్‌ గల కారు డ్రైవర్‌,  కారులో వ్యక్తులు భౌతికంగా దాడి చేసారని అయన అన్నారు. దాడికి దిగిన వ్యక్తులపై కావలి పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపిన కావలి పోలీసులు,   అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ప్రజల మద్య విధులు నిర్వహించే ఆర్టీసి కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన  చర్యలు చట్ట పరంగా తీసుకుంటామని ఆర్టీసీ ఎం.డి. సిహెచ్‌. ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....