Bus కింద పడుకుని యువకుడు చేసిన Stunt పై సజ్జనార్‌ సీరియస్‌ !

హైదరాబాద్‌,జూన్ 22 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్‌ చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోను బాగా గమనిస్తే.. అది ఫేక్‌ అని తెలిసిపోతుంది. ఎవరో గ్రీన్‌ మ్యాట్‌లో వీడియో చిత్రీకరించి, దాన్ని బస్సు కింద పడుకున్నట్లుగా ఎడిట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా, ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు.

ఈ వీడియో పూర్తిగా ఫేక్‌ అని సజ్జనార్‌ తెలిపారు. సోషల్‌ విూడియాలో పాపులర్‌ అయ్యేందుకు ఇలాంటి వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారని తెలిపారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొందరు తమ సరదా కోసం ఇలాంటి వీడియోలను ఎడిట్‌ చేసి షేర్‌ చేస్తే.. వాటి కారణంగా ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలను టీజీ ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....