హైదరాబాద్ జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నాన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ గెలుపొందారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయసుధ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

