పెద్దపల్లి ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హావిూల అమలుకోసం వ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడాని వెళ్తున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈసందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని కనీసం కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేయడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ప్రజలను, ఇతర పార్టీల నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తూ రాక్షస పాలన సాగిడ్తున్నదని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ని స్థానిక ఎమ్మెల్యే ని జైలుకు పంపడం ఖాయమని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరుపున పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఎవరికి భయపడే ప్రసక్తి లేదని అన్నారు.

.jpeg)