హైదరాబాద్, మార్చి 17 (ఇయ్యాల తెలంగాణ) : భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా హైదరాబాద్ గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షురాలిగా అనుముల పద్మ ను నియమించారు. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా హైదరాబాద్ గోల్కొండ జిల్లా అధ్యక్షురాలు నిత్యా పారిక్ నియామక పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ గోల్కొండ జిల్లాలోని అన్ని రకాల పార్టీ కార్యకలాపాలలో పాల్గొన వలసినదిగా పార్టీ కి సంబందించిన విధి విధానాలతో కూడిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళవలసినదిగా నిత్యా పారిక్ పద్మ కు సూచించారు. తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు కేవలం BJP పార్టీ ఒక్కటే కార్యకర్తలకు సరైన గుర్తింపు అందిస్తుందని పద్మ అన్నారు. పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేయడంతో పాటు మహిళా అభ్యున్నతికి పాటు పడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజులు పోయి వెలుగులు నిండే రోజులు వస్తాయని రాష్ట్రంలో రానున్నది BJP ప్రభుత్వమేనని అందరూ కలసి కట్టుగా శ్రమించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.