BJP`జేడీ(ఎస్‌) మధ్య అవగాహన సిద్ధరామయ్య ఎద్దేవా – ‘’BJP కి బీ`టీమ్‌ JDS

బెంగళూరు సెప్టెంబర్‌ 9 (ఇయ్యాలతెలంగాణ) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ`జేడీ(ఎస్‌) మధ్య అవగాహన కుదరడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. జేడీఎస్‌ సెక్యులర్‌ భావజాలాన్ని నిలదీశారు. సెక్యులర్‌ అనే పదాన్ని కేవలం పేరులోని ఇముడ్చుకుందని, ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని, అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమేనని అన్నారు. జేడీఎస్‌ పార్టీ బీజేపీ ‘బీ`టీమ్‌’ అని పేర్కొన్నారు.’’బీజేపీకి బీ`టీమ్‌ జేడీఎస్‌ అంటూ నేను చెబుతూనే ఉన్నాను. ఈరోజు అది రుజువైంది. నేను ఆ మాట అన్నప్పుడల్లా జేడీఎస్‌ నాపై విరుచుకుపడేది. జేడీఎస్‌ పేరులో సెక్యులర్‌ అని తగిలించుకుంది. కానీ మతతత్వ (కమ్యూనల్‌) పార్టీతో చేతులు కలిపింది’’ అని హుబ్బల్లిలో జరిగిన విూడియా సమావేశంలో సిద్ధరామయ్య అన్నారు. జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ పదేపదే ఏ పార్టీతోనూ కలిసేసి లేదని చెబుతుంటారని, పార్టీ మనుగడ కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నట్టు జేడీఎస్‌ సమన్వయ కమిటీ చీఫ్‌ జీడీ దేవెగౌడనే స్వయంగా ప్రకటించారని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....