భోజనం తరువాత నడక మంచిదేనా ?

హైదరాబాద్, నవంబర్‌ 23 (ఇయ్యాల తెలంగాణ) : చాలా మందిలో భోజనము తినగానే కునుకు తీసే అలవాటుంటుంది. కానీ తినగానే కాసేపైనా అటూ ఇటూ తిరగాలని పెద్దలంటుంటారు. తిన్న దగ్గర నుంచి కొద్దిగా నైనా పక్కకు జరగాలని ఏంతో మంది ఇళ్లల్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. తినగానే నడవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం ! 

భోజనము చేసిన తరువాత కొద్ది సేపైనా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. 

ఆహార నాళంలో ఉన్న భోజనము వేగంగా కదులుతుంది. 

భోజనం అయ్యాక 15 నిముషాలు నడవడం వల్ల అల్సర్, గుండెలో మంట, మలబద్దకం, కొలేరెక్టల్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

భోజనము చేసిన తరువాత నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. వీటి వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు నిద్ర లేమి సమస్యను దూరం చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఇంకెదుకిక ఆలస్యం ఈరోజు నుంచి తినగానే ఒకే దగ్గర కూర్చోవడమో పడుకోవడమో చేయకుండా చక్కగా నడక ప్రారంభించండి మరి ! 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....