దళితులు పంచములు కాదు.. ఆది హిందువులు అంటూనే జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారు. మన్యం సంఘాన్ని స్థాపించి దళితుల్లో చైతన్యం తెచ్చారు. జగన్ మిత్ర మండలి పేరిట దళిత బాలబాలికలకు విద్య నేర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. పలు సేవా కార్యక్రమాలతో దళిత జనోద్ధారకుడిగా, సంఘ సంస్కర్తగా, వైతాళికుడిగా నిలిచారు.. భాగ్యరెడ్డి వర్మ. మాదరి భాగయ్యగా జన్మించి సమాజ సేవా కార్యక్రమాలతో భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందిన ఆయన జయంతి ఈ రోజు… నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో అనగారిన వర్గాల గొంతుక భాగ్యరెడ్డి వర్మ 1888 సంవత్సరం మే 22 నాడు మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారాయన, తొలిపేరు భాగయ్య అయితే వారి కుల గురువు భాగ్యరెడ్డి అనే పేరు పెట్టారు. (రెడ్డి అంటే పాలకుడు అనే అర్థం కూడా ఉంది) చిన్నప్పటి నుండి సామాజిక స్పృహను అలవరచుకున్న భాగ్యరెడ్డిపై ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, బౌద్ధం ప్రభావం కూడా ఉంది. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాను చూసి ఆర్యసమాజం వర్మ అనే బిరుదును ఇచ్చింది.. అలా బాగ్యరెడ్డి వర్మ పేరు వచ్చింది.అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ. తదనంతర కాలంలో బాబా సాహెబ్ తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం, ఆది హిందువులం.’ అని సగర్వంగా చాటారు. అనగారిన కులాలను ఆది హిందువులు అని పిలవాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సూచన మేరకు హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు వారిని ఆది హిందువులుగా గుర్తించాయి. ప్రారంభంలో జగన్ మిత్ర మండలి, ఆ తర్వాత కాలంలోఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1910లో చాదర్ఘాట్ దగ్గర ఆది హిందూ పాఠశాల ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఈ పాఠశాలను సందర్శించారు. కాలక్రమంలో ఆది హిందూ పాఠశాలలు 26కు విస్తరించాయి.భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు. 1917లో విజయవాడలో అంటరాని కులాల సదస్సును నిర్వహించారు. ఆంధ్ర జిల్లాల్లో కూడా పర్యటించి అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకు వచ్చారు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో కన్నుమూశారు. 51 ఏళ్లకే ఆయన అకాల మరణంతో ఆది హిందూ ఉద్యమం, అనగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి విఘాతం కలిగించింది. భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుందాం.ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ ప్రదక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
- Homepage
- writers voice
- సంఘ సంస్కర్త, దళిత ఆత్మగౌరవ పతాక Bhagya Reddy వర్మ
సంఘ సంస్కర్త, దళిత ఆత్మగౌరవ పతాక Bhagya Reddy వర్మ
Leave a Comment