BC HOSTEL లో RAGGING

చంద్రగిరి  సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రగిరి ప్రభుత్వ సవిూకృత  బాలికల హాస్టల్‌ లో  ర్యాగింగ్‌ భూతం పడగ విప్పింది. తొమ్మిదవ తరగతి చదువుతున్నవిద్యార్థిని  జుట్టు ను పక్క నే వున్న బాయ్స్‌  హాస్టల్‌ విద్యార్థులు కత్తిరించి  అమానుషంగా ప్రవర్తించారు. చంద్రగిరి  ప్రభుత్వ బాలికల హాస్టల్‌ పక్కనే వున్న బాయ్స్‌ హాస్టల్‌ లోని  కొందరు పోకిరీ విద్యార్థులు సభ్య  సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు. బాధిత బాలికను మానసికంగా వేదించారు. ఈ సవిూకృత వసతి గృహం అనేక వివాదాలకు నిలయంగా మారింది. గతం లో ఈ హాస్టల్‌ లో మత్తు పదార్థాలు కూడా విద్యార్థులు వద్ద దొరికినట్టు  సమాచారం. హాస్టల్‌ లో ఉంటున్న కొదరు విద్యార్థులు గ్యాంగ్‌ లు గా ఏర్పడి ఇతర విద్యార్ధినుల పట్ల  అసభ్యకరంగా ప్రవర్తించడం బట్టలు విప్పమని బెదిరించడం, కాళ్ళు పట్టమనడం వంటి చేష్టలతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులను భయభ్రాంతులను గురి చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికైనా పోలీసు వారు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడే విద్యార్థుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....