
హైదరాబాద్ సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలకగా.. ఈ ఏడాది ఏకంగా రూ.35 లక్షలతో రికార్డులు బద్దలు కొట్టింది. కర్మన్జఘాట్కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్లో 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈసారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.