హైదరాబాద్, జనవరి 5 (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తీ కందికల్ బోయిగూడ ప్రాంతంలోని భానోదయ సంఘం బాబు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర బయలు దేరింది.అధిక సంఖ్యలో స్థానిక ప్రాంతానికి చెందిన మాల ధారణ చేసిన స్వాములు ఇరుముడులను కట్టుకొని భక్తి పారవశ్యంతో ఇక్కడి నుంచి శబరిమల యాత్రకు బయలు దేరారు. ఇందులో భాగంగా భట్ జీ బాబ మహా సంస్థానం దగ్గర నుండి స్వాములంతా పెద్ద ఎత్తున స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరి యాత్రకు బయలు దేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛత్రినాక సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ వర్మ, SC డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా CI ప్రసాద్ వర్మ స్వాములకు పలు సూచనలు చేశారు. స్వాములంతా అయ్యప్ప యాత్ర జాగ్రత్తగా ముగించుకొని ప్రతి ఒక్కరూ అనందంగా తిరిగి రావాలని కోరుకున్నారు.
- Homepage
- Charminar Zone
- Babu గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు బయలు దేరిన స్వాములు !
Babu గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు బయలు దేరిన స్వాములు !
Leave a Comment
Related Post