AUGUST 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ “నేనేనా’’ చిత్రం

 

ఆగష్టు 21 (ఇయ్యాల తెలంగాణ ):2012లో రిలీజైన ఎస్‌ఎంఎస్‌ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్‌ బేస్‌ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్‌ లవ్‌ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి చిత్రాలతో మంచి పేరును సాధించుకుంది. రెజీనా ప్రస్తుతం ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ లో ‘‘సూర్పనగై’’ అనే సినిమాను చేస్తుంది. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్‌ , జై ప్రకాష్‌ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్‌ సి ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్‌ అందుకున్న ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ పై ఈ చిత్రం తెరకెక్కింది.కాగా, అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి క్లీన్‌ ఙ/ం సర్టిఫికేట్‌ ను సెన్సార్‌ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్‌తో వస్తుంది అంటూ మూవీ యూనిట్‌ని సెన్సార్‌ సభ్యులు అభినందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....