August నుంచి వందే భారత్‌ స్లీపర్లు !

చెన్నై, జూలై 16, (ఇయ్యాల తెలంగాణ) : ప్రస్తుతం దేశమంతా వందేభారత్‌ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్‌ రైల్వేస్‌.. వచ్చే నెల నుంచి వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌ నుంచి తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్‌ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్‌`పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో వందేభారత్‌ సిట్టింగ్‌ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కాచిగూడ`బెంగళూరు మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆ రైలుకు 8 బదులుగా 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తోంది. అటు తిరుపతి`నిజామాబాద్‌ మధ్య నడుస్తోన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌.. ఇకపై బోధన్‌ వరకు వెళ్లనుంది. అంతేకాకుండా సికింద్రాబాద్‌`రాజ్‌కోట్‌ మధ్య రాకపోకలు సాగిస్తోన్న రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ను కచ్‌ జిల్లా వరకు పొడిగించాలని.. ఆ ప్రాంత వాసులు కోరగా.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ ప్రతిపాదనపై కూడా పరిశీలన జరుగుతోందని వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....