ఆషాడమాసం సందర్భంగా మెహందీ కార్యక్రమం

హైదరాబాద్‌, జూలై 12 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల వేడుకలను పురస్కరించుకొని సుల్తాన్షాహి లోని  బంగారు మైసమ్మ దేవాలయంలో మెహందీ కార్యక్రమం నిర్వహించారు. మొఘల్ పుర డివిజన్  ఓ బి సి మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాడ మాసం మెహేంది కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మెహేంది పెట్టుకున్నారు. ముందుగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా కన్వీనర్ లక్ష్మి దేవి  గోల్కొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ  మొగల్ పుర డివిజన్ ప్రెసిడెంట్ భగవతి  వీరమని  సూర్య కుమారి తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మెహేంది కార్యక్రమం ఓబీసీ మోర్చా కన్వీనర్ మంజుల  ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓబీసీ మోర్చా కో కన్వీనర్ పల్లెల లావణ్య,  కృష్ణవేణి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....