లడఖ్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) :లడఖ్ లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ు`72 ఆర్మీ యుద్ధ ట్యాంక్ నదిని దాటుతుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కొట్టకుపోయింది. ఈ ఘటనలో యుద్ధ ట్యాంక్ తోపాటు ఐదుగురు జవాన్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.లడఖ్ లోని నియోమా`చుషుల్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఎసి) సవిూపంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఐదుగురు సైనికులతో ు`72 ట్యాంక్ నదిని దాటుతుండగా ఆకస్మిక వరదల కారణంగా మునిగిపోయింది. అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో ట్యాంక్లో ఒక జేఓసీ, 4 జవాన్లతో సహా ఐదుగురు సైనికులు ఉన్నారు. ఒకరి ఆచూకీ లభించింది. ఇతరుల కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

