Army యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి !

లడఖ్‌,  జూన్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) :లడఖ్‌ లో ఇండియన్‌ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ు`72 ఆర్మీ యుద్ధ ట్యాంక్‌ నదిని దాటుతుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కొట్టకుపోయింది. ఈ ఘటనలో యుద్ధ ట్యాంక్‌ తోపాటు ఐదుగురు జవాన్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.లడఖ్‌ లోని నియోమా`చుషుల్‌ ప్రాంతంలోని లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఎసి) సవిూపంలో దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఐదుగురు సైనికులతో ు`72 ట్యాంక్‌ నదిని దాటుతుండగా ఆకస్మిక వరదల కారణంగా మునిగిపోయింది. అధికారులు తెలిపారు. సంఘటన సమయంలో ట్యాంక్‌లో ఒక జేఓసీ, 4 జవాన్లతో సహా ఐదుగురు సైనికులు ఉన్నారు. ఒకరి ఆచూకీ లభించింది. ఇతరుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....