ARMY – కొత్త వైస్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు

న్యూఢిల్లీ,  ఫిబ్రవరి 19 (ఇయ్యాల తెలంగాణ) :  ఆర్మీ కొత్త వైస్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎంవీ సుచీంద్ర కుమార్‌ స్థానాన్ని భర్తీ చేశారు. జమ్ముకశ్మీర్‌ ఉధంపూర్‌లోని నార్తర్న్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండిరగ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎంవీ సుచీంద్ర కుమార్‌ నియమితులయ్యారు.కాగా, ఆర్మీ కొత్త వైస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, దీనికి ముందు నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించే ముందు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్‌గా ఆయన స్థానాన్ని భర్తీ చేయడంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ముందున్నట్లు తెలుస్తున్నది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....