April నుంచి Sir ప్రక్రియ: కేంద్ర ఎన్నికల సంఘం

న్యూ ఢిల్లీ, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) :  తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణల్లో ఏప్రిల్‌ నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ) అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఎస్‌ఐఆర్‌ ప్రారంభించి, మే నెల మూడవ వా రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడిరచారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తొలి దశను బిహార్‌ లో పూర్తి చేయగా ప్రస్తుతం రెండో దశలో దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తోంది. రెండవ దశలో గుజరాత్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల్లో కొ నసాగుతున్న ఎస్‌ఐఆర్‌ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎపి, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రా ల్లో మూడవ దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపడతామని అధికారులు వెల్లడిరచారు. అయితే ఈ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....