April లో ప్రారంభం కానున్న SIR..

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.ఈ మేరకు గురువారం ఈసీ కార్యదర్శి పవన్ దివాన్ లేఖ విడుదల చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా సాధ్యమైనంత త్వరగా సన్నాహక పనులను పూర్తి చేయాలని ముఖ్య ఎన్నికల అధికారులకు తెలియజేశారు.కమిషన్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో SIR`సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్లో ఈప్రక్రియ మొదలు పెట్టడానికి సన్నాహాలు వేగవంతం చేశారు. నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర’ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో తెలంగాణ కూడా ఉంది.ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డియులో ఏప్రిల్ నుంచి ‘సర’ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.‘సర’లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....