April 5న ‘శశివదనే’ ప్రపంచవ్యాప్తంగా విడుదల

రక్షిత్‌ అట్లూరి, కోమలి జంటగా నటించిన‘శశివదనే’ ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల

‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్‌ అట్లూరి. అలాంటి రక్షిత్‌ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్‌ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఇది ంఉ ఫిల్మ్‌ కంపెనీ, ూపూ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

శశి వదనే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఏప్రిల్‌ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్‌ ఆ పోస్టర్‌ విూద హైలెట్‌గా నిలిచింది. ఆ డైలాగ్దతో సినిమా సారాన్ని చెప్పేశారు. శశివదనే స్వచ్చమైన గ్రావిూణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు. ఏప్రిల్‌ 5న రానుంది.ఈ చిత్రంలో రంగస్థలం మహేష్‌, శ్రీమాన్‌, జబర్దస్త్‌ బాబీ, ప్రవీణ్‌ యండమూరి మరియు దీపక్‌ ప్రిన్స్‌ కీలక పాత్రలు పోషించారు.

నటీనటులు: రక్షిత్‌ అట్లూరి, కోమలి, శ్రీమన్‌, దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ, రంగస్థలం మహేష్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....