AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

 

విజయవాడ జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌  ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌  ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ పాల్గోన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మ్న్‌ జకియా ఖానమ్‌, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కి సిఎం  వైఎస్‌.జగన్‌ కి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....