అందమైన ఆహారం వెనుక.. అంతులేని కల్తీ ఆహార విక్రయం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 06 (ఇయ్యాల తెలంగాణ) : నోరూరించే రుచికర ఆహారం తిందామని హోటల్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు ఆశ్రయిస్తున్న ప్రజల ఆరోగ్య చెలగాటమాడుతూ వ్యాపారం నిర్వహిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు హోటల్లు ఫాస్ట్‌ ఫుడ్‌ నిర్వాహకులు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని పెద్ద పెద్ద హోటల్‌ నుంచి చిన్న చిన్న హోటల్లు రెస్టారెంట్‌ ఫాస్ట్‌ సెంటర్లు అందరూ ఒకటే బాటగా నాణ్యత లేని ఆహార పదార్థాలు వంటకాలు తయారుచేసి అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మల్లాపూర్‌ నాచారం చిల్కానగర్‌ ఉప్పల్‌ ప్రాంతాలలో రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు కుప్పలు తెప్పలుగా ఎక్కడపడితే అక్కడ పెట్టి నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేస్తూ అనారోగ్యంతో చెలగాట మాడుతున్నారు. శుభ్రతను గాలికి వదిలేసి ప్రధానంగా మాంసాహారం విక్రయాలను నిర్వహించి హోటలు రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది యజమానులు లైవ్‌ లో మటన్‌ చీకులను స్వయంగా కొనుగోలు చేసి వాటిని తమ తమ హోటల్‌ రెస్టారెంట్‌ విక్రయిస్తూ 80 శాతం నిబంధనలు పాతర వేసి వంటకాలు తయారు చేస్తూ భోజనం భోజన ప్రియులకు షాక్‌ ఇస్తున్నారు.

రంగు సాసులతో కలిపి వంటకాలు చూస్తూ వారి బిల్లు చెల్లించి వెళ్తున్నారు. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు కల్తీ ఆహార విక్రయాలపై అటు జిహెచ్‌ఎంసి కానీ నిఘా పెట్టాల్సిన విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు కానీ వీటి జోలికి వచ్చిన దాఖలాలే లేవు. చనిపోయిన రోగాల బారిన పడిన గొర్రె మేక మాంస విక్రయాలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆరోపలు సైతం వినపడుతున్నాయి. చనిపోయిన మేక కోడి మాంసాలను ఫ్రిజ్లో నిలువ నిలువ చేస్తూ ఆయా మటన్‌ చికెన్‌ లతోనే ఆహార వంటకాలు తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్లు. చిన్న చిన్న హోటల్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు రోడ్‌ సైడ్‌ వ్యాపారాలు సాగించేవారు ఆహార పదార్థాలకు తమదైన స్టైల్‌ లో పేర్లు పెట్టి భోజనం లేని ఆకర్షిస్తూ నాణ్యతలేని భోజనానికి సప్లై చేస్తూ ప్రజలు అనారోగ్య బారిన పడుతుంటే వీరు మాత్రం నాణ్యతలేని భోజనాన్ని పెట్టి జేబులు నింపుకుంటున్నారు. అసలే వేసవి కాలం రావడంతో రంగురంగులుగా కలర్లు సాసులతో ఫాస్ట్‌ ఫుడ్‌ తయారుచేసి సప్లై చేయడం వల్ల ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రియులు అనారోగ్యపాలు పడుతున్నారని పలువురు వాపోతున్నారు.

చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఫాస్ట్‌ ఫుడ్‌ విూద ఆకర్షణ పడేవిధంగా ఫాస్ట్‌ ఫుడ్‌ యజమాన్యాలు కలర్లను సాసులను తో ఆకర్షిణించే విధంగా చేయడం ద్వారా సాయంత్రం కాగానే ఫాస్ట్‌ ఫుడ్‌ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. ఫాస్ట్‌ ఫుడ్‌ ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నప్పటికీ వీరు చేసే మాయాజాలంతో ప్రజలు ఆకర్షితులై ప్రాణాల విూదికి తెచ్చుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లపై నిఘా కొరవడంతోనే కుప్పలు తెప్పలుగా ఫస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు. నాచారం మల్లాపూర్‌ నాచారంఉప్పల్‌ ప్రాంతంలోనే దాదాపు 200 పైగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ ఉన్నాయంటే పరిస్థితి ఏమైపోయిందో ఎట్టా అర్థమవుతుంది. హోటల్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లో శుభ్రత నాణ్యత పరిశీలించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే వలనే వీళ్ళ ఆగడాలకు హద్దు అదుపు లేదంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నాణ్యత లేని ఆహారం సప్లై హోటల్స్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....