Amberpet గోల్నాక సర్వీస్‌ రోడ్‌ ప్రారంభం.. !

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) :  గత నాలుగేళ్లుగా అంబర్పేట్‌ నియోజకవర్గ పరిధిలోని చే నెంబర్‌  నుంచి గోల్నాక వైపు జరుగుతున్న రోడ్‌ పనుల కారణంగా అంబర్పేట్‌, ఉప్పల్‌, రామంతపూర్‌ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ చొరవ తో ఈ సర్వీస్‌ రోడ్‌ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని బి ఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చింతల నరసింహారెడ్డి తెలిపారు. రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.తరువాత బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీస్‌ రోడ్డును పరిశీలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....