AAP – ఎంపీ సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఇయ్యాల తెలంగాణ) : రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దాపై ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేయబడ్డారు. నలుగురు రాజ్యసభ ఎంపీల తమ అనుమతి లేకుండా తమ పేర్లను ఆగస్టు 7న తీర్మానంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ బుధవారం ఎంపీల ఫిర్యాదులను ప్రివిలేజెస్‌ కమిటీకి పంపారు.ఎంపీలు సస్మిత్‌ పాత్ర, ఎస్‌ ఫాంగ్నాన్‌ కొన్యాక్‌, ఎం తంబిదురై, నరహరి అవిూన్‌ తమను అడగకుండానే తమ పేర్లను హౌస్‌ ప్యానెల్‌లో చేర్చారని రాఘవ్‌ చద్దాపై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాఘవ్‌ చద్దాను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆప్‌ ఆరోపించింది. రాఘవ్‌ చద్దాపై ఫోర్జరీ సంతకాల ఆరోపణలు తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైనవి అని ఆ పార్టీ పేర్కొంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాఘవ్‌ చద్దాను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆప్‌ ఆరోపించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....