AADHAR సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు !

అక్టోబర్‌ 1 నుంచే అప్‌డేట్‌ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా పేరు, అడ్రస్‌, ఇప్పుడు రూ. 75, బయోమెట్రిక్‌ మార్పులకు రూ. 125 చెల్లించాలి.పిల్లలకు ఫ్రీ:7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్‌ ప్రింట్స్‌, బయోమెట్రిక్‌ మార్చడానికి అయ్యే ఖర్చును ఙఎఆంఎ ఉచితం చేసింది.ఒక ఆధార్‌`ఒక వ్యక్తి: నకిలీ ఆధార్‌ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఙఎఆంఎ హెచ్చరించింది.ఫ్రీ గడువు ముగిసింది: జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్‌డేట్‌లకు ఫీజు వర్తిస్తుంది.నవంబర్‌ 1 నుంచి డిజిటల్‌ అప్‌డేట్‌:నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే..జనాభా వివరాల అప్‌డేట్‌ పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రావిూణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోవిూటర్లు ప్రయాణించి ఆధార్‌ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్‌ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. కానీ ఫింగర్‌ ప్రింట్స్‌, ఐరిస్‌ వంటి బయోమెట్రిక్‌ అప్‌డేట్స్‌ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్‌ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....