Aadhar నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్‌ ప్రతాప్‌ యాదవ్‌

తుగ్గలి, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ) :  మండలం పరిధిలోనీ గల బొందిమడుగుల గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయం కార్యాలయంలో గ్రామ సర్పంచ్‌ గౌరవ సలహాదారులు ఎస్‌.ప్రతాప్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది సమక్షంలో శుక్రవారం రోజున ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా గౌరవ సర్పంచ్‌ సలహాదారులు ఎస్‌.ప్రతాప్‌ యాదవ్‌ మాట్లాడుతూ బొందిమడుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పలు గ్రామాలలోని ప్రజలు సచివాలయంలోని ఆధార్‌ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.ఆధార్‌ నమోదు కేంద్రం ద్వారా ఆధార్‌ కార్డులోని గల సరి చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాంజినేయులు,హుసేన్‌, లక్ష్మి,నారాయణ,సుబ్బరాయుడు, సుదర్శన్‌,నడిపి హుసేన్‌,దుబ్బ కాశిం, వడ్డే వెంకటేష్‌,నేసే నాగేష్‌,మహమ్మద్‌, వడ్డే పులికొండ మరియు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....