హైదరాబాద్, ఆగస్టు 21 (ఇయ్యాల తెలంగాణ) : చంపాపేట్‌లోని కటికొనుకుంట ప్రాంతంలో అమ్మవారి ఆలయంలో విగ్రహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. విగ్రహం ఎలా మాయమైంది? ఎవరైనా అపహరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
