17 మంది విద్యార్దులకు గంజాయి పాజిటివ్
హైదరాబాద్, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (ఊఅఙ) క్యాంపస్‌లో తెలంగాణ ఈగల్ (ఇంఉఒఇ) టీమ్ మరియు సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసారు. యÖనివర్సిటీ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు, వాడకం జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో హైదరాబాద్ సెంట్రల్ యÖనివర్సిటీ క్యాంపస్‌లో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. 17 మందికి పాజిటివ్ అనుమానం ఉన్న విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రధాన నిందితుడి అరెస్ట్ విద్యార్థులకు అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుడు అస్సాం రాష్ట్రం నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది క్యాంపస్‌లో ఒక్కో గ్రాము గంజాయిని సుమారు 500 రూపాయ లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం యÖనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు, నిందితుల సమాచారం పోలీసుల అధికారిక ప్రకటన ద్వారా వెలువడాల్సి ఉంది.
