హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ): బీజేపీ నాయకులు శక్తి కేంద్ర ప్రముఖ్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీజీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సుధాకర్ శర్మ గారి నివాసంలో వీక్షించారు. గౌలిపుర డివిజన్ లో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమ వీక్షణ కార్యక్రమం ముఖ్య అథితిగా సుధాకర్ శర్మ కొనసాగారు. మోడీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తున్నదని బీజేపీ నాయకులు అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడి సురేందర్ బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఇ. సుమన్ కుమార్, జమాల్ పూర్ చంద్ర శేఖర్ డొంకి యాదగిరి, జమాల్ పూర్ అశోక్, ఎం. వెంకటేష్ , కె. ప్రేమ్ రాజ్, పోలింగ్ బూత్ ఇంచార్జి రవి కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
