యాదాద్రి, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీ నరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.ముఖ్యమంత్రి తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ , అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.
