న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్టీమింగ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా “తిమ్మరాజుపల్లి టీవీ” సంబరాలు ఈవెంట్ ను హైదరాబాద్ లో సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆహా నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ` ఎసఆర్ కల్యాణమండపం సినిమా కోసం ఫస్ట్ టైమ్ కిరణ్ గారితో మాట్లాడాను. అప్పటి నుంచి వారితో మా ఆహా జర్నీ కంటిన్యూ అవుతోంది. సమ్మతమే, రూల్స్ రంజన్, కె ర్యాంప్..ఇలా ఆయన సినిమాలన్నీ మా ఆహాలో స్టీమింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాను ఆహా సబ్ స్కైబర్స్ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నేను పర్సనల్ గా ఈ సినిమా చూస్తూ బాగా కనెక్ట్ అయ్యాను. ఆహా ద్వారా మరింతమంది ప్రేక్షకులకు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ ` ఆహా ఈవెంట్ తో మరోసారి మా టీమ్ అంతా కలుసుకోవడం సంతోషంగా ఉంది. థియేటర్స్ లో మా మÖవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆహాలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ ఇండస్టీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నారు.
మÖ్యజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ ` ఈ సినిమా టైమ్ లో ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నాను. ఈ సినిమాకు మÖ్యజిక్ అందించే సమయంలో కిరణ్ గారు, డైరెక్టర్ మునిరాజు ఎంతో సపోర్ట్, ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా మÖ్యజిక్ డైరెక్టర్ నేను అని గర్వంగా చెప్పుకుంటాను. అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ ` ఈ సినిమాతో మేము ఎలాంటి విజయాన్ని ఆశించామో, ఎలాంటి రెస్పాన్స్ ఆశించామో అది దక్కింది. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాను ఆదరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆహాలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రాన్ని చూసి, బాగుందని చెప్పి సీఎం చంద్రబాబు గారి దగ్గరకు నన్ను మా వాళ్లు తీసుకెళ్లారు. ఈ చిత్రంలో నటించిన వారికి, సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు దక్కింది. అన్నారు.
నటి స్వాతి కరిమిరెడ్డి మాట్లాడుతూ ` మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాను థియేటర్స్ లో చూస్తూ ప్రేక్షకులు తమ మెమొరీస్ గుర్తుకుతెచ్చుకున్నారు. వాళ్లు పర్సనల్ గా మా సినిమాతో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆహాలోకి మా సినిమా వస్తోంది. ఆహాలో సక్సెస్ అయ్యాక సక్సెస్ విÖట్ లో మళ్లీ కలుస్తాను. అన్నారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ ` థియేటర్స్ లో మా సినిమా రిలీజైనప్పుడు ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పలేదు. మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సపోర్ట్ చేశారు. థియేటర్స్ లో మా సినిమా చూడని వారు ఆహాలో చూడండి. విÖరు ఖచ్చితంగా సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు. కిరణ్ గారు ఇలాగే కొత్త టాలెంట్ కు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ ` థియేటర్స్ లో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాను చూసిన వాళ్లు వాళ్ల రెస్పాన్స్ చెప్పినప్పుడు మా టీమ్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. కిరణ్ గారికి మేమంతా థ్యాంక్స్ చెబుతూనే ఉంటాం. ఆహా గోల్డ్ వారికి ఇప్పటికే మÖవీ అందుబాటులో ఉంది. ఈ నెల 15 నుంచి సబ్ స్కైబర్స్ అంతా చూసి మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ ` మా టీమ్ అంతా మరోసారి ఈవెంట్ లో కలుసుకున్నాం. ఇలా విÖట్ అవడం మా అందరికీ సంతోషాన్నిస్తోంది. కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించిన సుమైర స్టూడియోస్, కేఏ ప్రొడక్షన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. థియేటర్స్ లో విÖరు మంచి సక్సెస్ అందించారు. ఇప్పుడు ఆహా ద్వారా మరింత మంది ఆడియెన్స్ కు మా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా రీచ్ అవుతుంది. మా టీవీ ఇప్పుడు విÖ ఇంట్లో టీవీలోకి ఆహా ద్వారా వస్తోంది. అన్నారు.
ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ` నా సక్సెస్, ఫెయిల్యూర్స్ లో ఆహా తోడుగా ఉంది. ఆహాలో నా సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. రామ్ గారు, అరవింద్ గారు కిరణ్ సినిమా అంటే నమ్మకంతో తీసుకుంటారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్రీనివాస్ గారు నాతో ఒక సోదరుడిలా ఉంటారు. సినిమాల గురించి చర్చించుకుంటాం. నా మÖవీస్ గురించి కనుక్కుంటారు. నేను నా సినిమాలు ఆహాలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో తెలుసుకుంటాను. తిమ్మరాజు పల్లి టీవీ సినిమా విషయంలో సంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి కాంపాక్ట్ బడ్జెట్ లో మేము అఛీవ్ మెంట్ చేశాం. అది మా మÖవీ టీమ్ వల్లే సాధ్యమైంది. వీళ్లందరి సపోర్ట్ వల్లే ఇంత మంచి క్వాలిటీ సినిమా చేయగలిగాం. కిరణ్ కొత్త వాళ్లతో సినిమా చేశాడని..విÖడియా మిత్రులు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే సరిచేసుకుంటాం. మాతో అసోసియేట్ అయిన సుమైర స్టూడియోస్ తేజ వేల్పుచర్లకు థ్యాంక్స్. నెలరోజుల్లోనే మా టీమ్ అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి ప్రతిభ గల వారికి అవకాశాలు దక్కాలనే మేము ఈ ప్రయత్నం చేశాం. వంశీకాంత్ రేఖన మÖ్యజిక్ మా చిత్రానికి బ్యాక్ బోన్ అయ్యింది. “తిమ్మరాజుపల్లి టీవీ” ఒక మంచి సినిమా అనే ఇంప్రెషన్ ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉంది. వాళ్లంతా ఆహాలో మా మÖవీ చూస్తారని ఆశిస్తున్నా. మంచి నోస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే చిత్రమిది. తప్పకుండా ఆహాలో రేపటి నుంచి మా మÖవీ చూడండి. నేను ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ కంప్లీట్ చేశాం, గువ్వలచెరువుఘాట్ షూటింగ్ చివరి దశలో ఉంది. నా డైరెక్షన్ లో చేస్తున్న సినిమా గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తా. అన్నారు.
నటీనటులు ` సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
