‘కెడి: ది డెవిల’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా మొత్తం థియేటర్‌ను షేక్ చేసేలా ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజిల్స్ వేయించే సీన్లు, అదిరిపోయే యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, కళ్లుచెదిరే విజువల్స్‌తో ట్రైలర్ ఇప్పటికే సోషల్ విÖడియాలో దుమ్మురేపుతోంది.
ఇప్పటికే కర్ణాటక అంతా గర్జించేలా హైప్ క్రియేట్ చేసిన ‘కెడి: ది డెవిల’.. ఈ ఏడాది విడుదలైన యాక్షన్ సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా భారీ స్థాయి, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లు, పక్కా మాస్ అప్పీల్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో థియేటర్లలో పూర్తి స్థాయి మాస్ ఫీస్ట్ ఇవ్వబోతుందనే అంచనాలు పెరిగిపోయాయి. దుమ్మురేపే యాక్షన్ బ్లాక్స్, గ్రిప్పింగ్ వరల్డ్, గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్ సిల్వర్ స్కీన్‌పై రాబోయే హంగామాకు పవర్ఫుల్ గ్లింప్స్ ఇచ్చింది.
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ అందరూ ఈ కంటెంట్‌ను ఉత్సాహంగా స్వాగతిస్తూ సినిమాపై భారీ ఆసక్తి చూపిస్తున్నారు.
కన్నడలో వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్‌తో జోష్‌లో ఉన్న ‘కెడి: ది డెవిల’ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 15న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా, మాస్ మÖవీని మరో లెవల్‌కు తీసుకెళ్లబోతోంది.
దక్షిణ భారతదేశంలో భారీ అంచనాలు, పెరుగుతున్న హైప్‌తో రిలీజ్ అవుతోన్న కెడి: ది డెవిల్ మÖవీ యాక్షన్, ఎమోషన్, స్టైల్, మాస్ సెలబ్రేషన్స్‌తో ఆడియెన్స్‌కు మరిచిపోలేని థియేట్రికల్ అనుభూతిని ఇవ్వబోతోంది. డెవిల్ వచ్చేశాడు… ఇక అసలైన మాస్ హంగామా ఇప్పుడే మొదలైంది.
