హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆరఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై వీరిద్దరికి అవగాహన లేనట్లు ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ఈ పన్నెండు ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్టానికి అందించిన సహకారంపై తాము ఎప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.హైదరాబాద్లో ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో మరింత బలోపేతం అవుతామని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం కాదన్నారు.ఇది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ నేరుగా తెలంగాణలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల కంటే ముందే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయిందని చెప్పారు. తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగా ఏ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయవచ్చునన్నారు.
