తమిళనాడు, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని ఫలితాలు వచ్చాయి.. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే పార్టీకి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార పార్టీ అగ్రనేతలందరూ తమ సొంత నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో వెనుకంజలో పడ్డారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఆయనకు వ్యతిరేక ఫలితాలు రావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, రాష్ట్ర కేబినెట్లోని 28 మంది మంత్రులు వెనుకంజలో కొనసాగారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ లో వెనుకబడగా, ఇప్పుడు మంత్రులందరూ అదే బాటలో ఉండటంతో డీఎంకే పతనం ఖాయం అయింది. రాజకీయ అరంగేట్రం చేసిన తొలిసారే నటుడు విజయ్ ప్రభంజనం సృష్టించారు. టీవీకే పార్టీ ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐడీఎంకే రెండో స్థానంలో ఉండగా, అధికార డీఎంకే కేవలం మÖడో స్థానానికి పడిపోయింది.
