హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఇయ్యాల తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు..కేబినెట్ భేటీలో తెలుపుతూ ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని ఈ అంశంపై ప్రభుత్వం దష్టి సారించిందని తెలిపారు.శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు..
