హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఇయ్యాల తెలంగాణ) : సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా హైడ్రామా చోటుచేసుకుంది. ఆల్కహాల్ తాగి వచ్చాడని అనుమానంతో సుబ్బారావుకు పంజాగుట్ట సీఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. రీడింగ్ 27 పాయింట్లు రాగా, మోతాదులోపు ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్దారణ అయింది. అయితే తాను రాత్రి మద్యం సేవిస్తే ఉదయం పీఎస్‌కు వచ్చిన తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటని లాయర్ సుబ్బారావు పోలీసులను ప్రశ్నించారు. తనను అవమానించి, కేసు తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా డ్రంక్ చేసి వాహనం నడిపానా ఏంటి.. కేవలం ఫిర్యాదు చేయడానికి కామన్ మ్యాన్‌లా పీఎస్‌కు వచ్చిన తనతో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. తనపై మంగ్లీ చేసిన ఆరోపణలకు ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. తనపై నిరాధార ఆరోపణలను చేయడంతో ఎంతో మందిని మోసం చేసిన సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను కోరారు. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తారు, వారి గురించి విÖరు హడావుడి చేయవద్దు అని సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు సూచించారు. అయితే బాధితుల తరఫున తాను లీడ్ చేస్తున్నానని, లాయర్ గా వారికి అన్ని రకాలుగా చట్ట ప్రకారం సహాయం చేస్తానన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని, బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.
పాటే నా ప్రాణం.. నన్ను రోడ్డుకు లాగకండి: సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో వందల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు న్యాయవాదిపై ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విÖడియా ముందుకు వచ్చిన ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
మార్చి 21న సుభా సియపోగు అనే వ్యక్తి తనను కలిశారని, లాయర్ సుబ్బారావు అనే వ్యక్తితో కలిసి తనను అమర్యాదగా బెదిరించారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియోలు చూపించి, తనను కలవకపోతే పరువు తీస్తానని ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. ఈ పరిణామాలతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
మీడియాకు మంగ్లీ రిక్వెస్ట్..!
‘నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. కేవలం పాటే నా ప్రాణం. ఎవరో వచ్చి ఆరోపణలు చేస్తే నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’ అని మంగ్లీ విÖడియాను వేడుకున్నారు. కేవలం ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తి తనపై 150 కోట్ల మోసం అనే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ విÖడియా ద్వారా ఎదిగిన తనకు, అదే శాపంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన చెందారు. గతంలో తనపై రాజకీయ ముద్రలు వేయడంతో తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు పాడలేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
