రాయ్ పూర్, ఫిబ్రవరి 9, (ఇయ్యాల తెలంగాణ) : నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక సమావేశం నిర్వహించారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగిన ఈ సమావేశంలో, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల పురోగతిని అమిత్‌షా సమీక్షించారు. తీవ్రవాదంపై చేపట్టిన పోరాటంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని ఆయన పేర్కొన్నారు.
