1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్ఫురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25 నుండి నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవమును జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కవిÖషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించింది.
18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది. ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తి ఇవ్వనుంది. భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత , ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం,జాతి, కులం, వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని అందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు.
