న్యూఢిల్లీ, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : ఇరాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు, ఇంటర్నెట్ నిలిపివేత నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొదటి బ్యాచ్‌గా 292 మంది భారతీయులు, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, ఉమ్రా యాత్రికులు, వ్యాపారవేత్తలు శనివారం తెల్లవారుజామున టెహ్రాన్ నుండి ఢల్లీి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇరాన్ ఎయిర్‌స్పేస్ తాత్కాలికంగా తెరవడంతో చార్టర్డ్ విమానం ద్వారా ఈ తరలింపు సాధ్యమైంది.
