👉 సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉 మోసపోవడానికి ప్రధాన కారణం…. అత్యాశ, అశ్రద్ద…
👉 మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.పథకాల పేరుతో వచ్చే తెలియని ఫేక్ లింకులను క్లిక్ చేయవద్దు.
👉 బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు… జాగ్రత్త!…
👉 డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు, జనవరి 16, (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మవడి వంటి పథకాల పేరుతో సోషల్ విూడియాలో ఫేక్ లింకులను పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని , ఫేక్ల్ లింకులను క్లిక్ చేయవద్దన్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
