హైదరాబాద్, డిసెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ 3వ మోడర్న్ కబడ్డీ ఇంటర్ జిల్లా ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఈ నెల 23 వ తేదీ నుంచి ప్రారంభ మవుతాయని ఆసక్తి గల బాల బాలికలు ముందుకు రావాలని కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. గౌలిపుర లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ మిత్ర క్లబ్ లో హైదరాబాద్ జిల్లా సెలెక్షన్ ట్రయల్ పురుషులు మరియు మహిళలు తేదీ 23.12.2025 మంగళవారము సాయంత్రం 4.30 గం ల.కు జరుపబడునున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్ జిల్లా లో సెలెక్షన్ అయిన క్రీడాకారులు తేదీ 26.12.2025 నుండి 28.12.2025 కామేపల్లి జూనియర్ కళాశాల గ్రౌండ్ ఖమ్మం జిల్లాలో జరిగే సీనియర్ ఇంటర్ జిల్లా మోడర్న్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో అడ డానికి అర్హులుగా ప్రకటించారు. ఆసక్తి గల క్రీడాకారులు రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో పాటు ఆధార్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్, టెన్త్ మెమో జత చేసి పంపాలని మరిన్ని వివరాలకు కోచ్ లు ఎం. రవీందర్ చరవాణి : 7396359825, ఎం. దేవేందర్, చరవాణి : 9966589455, సయ్యద్ జమీల్ చరవాణి : 9985715154 లను సంప్రదించాలని కోరారు.
