
ఇప్పటికైనా ఆమె రిటైర్మెంట్ ప్రయోజనాలను విడుదల చేయాలి
ఆమెను మానసిక వేదన నుండి బయటకు తీసుకోవాలని డిమాండ్
భువనగిరి నళిని స్వగృహానికి వెళ్లి పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బృందం
హైదరాబాద్ , సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాజీ డీఎస్పీ నళినిని ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని గారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి , మాజీ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ , సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ , ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విూడియాతో మాట్లాడుతూనళిని తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ ఫోర్స్లో ఉన్నప్పటికీ జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి మద్దతు ఇచ్చి రాజీనామా చేశారన్నరు.నళిని రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది, కానీ ఇప్పటి వరకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయలేదు.గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నళిని గారిని ఇబ్బందులకు గురిచేసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హావిూ ఇచ్చినప్పటికీ, బెనిఫిట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు.నళిని గారు 16 పేజీలలో రిపోర్ట్ సబ్మిట్ చేసి పరిస్థితులను వివరించి నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇతర కారణాలు చెబుతూ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదు. ఫలితంగా నళిని గారు మానసిక వేదనకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించింది.ఇటువంటి పరిస్థితుల్లో నళిని కి మద్దతుగా నిలుస్తూ… బిజెపి బృందం ఆమెను పరామర్శించడం జరిగింది. నళిని గారు రిటైర్మెంట్ వేతనం, ఇతర అధికారిక ప్రయోజ నాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రయోజ నాలను విడుదల చేసి, ఆమెను మానసిక వేదన నుండి బయటకు తీసుకోవాలి.ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరితే, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలిసేలా ప్రయత్నిస్తా నన్నారు.
