
ఖమ్మం, సెప్టెంబర్ 5, (ఇయ్యాల తెలంగాణ) : :పినపాక నియోజక వర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాం తం ఇక్కడ పలుపరిశ్రమలు, సింగరేణి సంస్థలున్నాయి. వేలాది మంది పేదలు ఆయా పరిశ్రమలలోకి పనులకు వెళ్తుంటారు. పేద, దిగువ మధ్య తరగతి, ఆదివాసి జనాభా గ ణనీయంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత గ్రామాల పై మైక్రో ఫైనాన్స్ సంస్థలు గురి పెట్టాయి. పదేళ్ల క్రితం పేద కుటుంబాలను చిన్నా భి న్నం చేసిన సంస్థలు ఇటీవల కాలంలో తిరిగి మళ్లీ చాపకింద నీరులా తమ వ్యాపార కార్యక్రమాలను మొదలు పెట్టాయి. దీంతో గ్రా మాల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ వడ్డీ వ్యాపారం) పడగ విప్పుతూ అధిక వడ్డీలతో పేదలపై బుస కొడుతున్నాయి. అమాయక పేద ప్రజల అవసరాలే ఆసరాగా అధిక వడ్డీలకు రుణాలిచ్చి వారి నడ్డి విరుస్తున్నాయి. పోట పోటీగాపాగా.. అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. స్పందన, కీర్తన,అన్నపూర్ణ ,బంధన్, ముథూట్, బజాజ్, పిన్ కే ర్, ఐఐ ఎఫ్ఎల్ ఇలా పేర్లు వేరై నా మైక్రో ఫైనాన్స్ వ్యాపారమే వారి లక్ష్యం. పదుల సంఖ్యలో గ్రామా లలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ .50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి.
పేద, మధ్య తరగతి జనాలే టార్గెట్ గా చేసి, ఐదు నుంచి పది మంది.సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఎలాంటి షూరిటీ లేకుండానే ఆధార్,పాన్ కార్డుల తోనే లోన్లు ఇస్తూనే దగాకు తెరలేపుతున్నాయి. ఒక సభ్యురాలికి రూ.50 వేలు అప్పు ఇచ్చే సమయంలోనే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్,ఇన్సూరెన్స్ పేర్లు చెప్పి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు కోత పెడుతున్నాయి. అవసరాన్ని బట్టి వందకు రూ.3 నుంచి రూ.5 చొప్పున వడ్డీవసూలు చేస్తున్నాయి. కిస్తీ లేటైతే రోజుకు రూ. వంద చొప్పున ఫైన్ వసూలు చే స్తున్నాయి. దీంతో పేదలు వాటిని ఆశ్రయించి అధిక వడ్డీలకు బలవుతున్నారు.కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు అ మాయక మహిళలకు రుణాలు ఇచ్చి వారి నుంచి వాయిదాల రూపంలో వడ్డీ డబ్బులనుఅధికంగా వసూలుచేస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు వడ్డీ చెల్లింపులు ఆలస్యమైతే పెద్ద మొత్తం లో జరిమానాలు విధిస్తూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.
అధిక వడ్డీపై మహిళలు ప్రశ్నిస్తే సంస్థల ప్రతి నిధులు దురుసుగా ప్రవర్తిస్తు, మహిళలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు తీసుకున్న వారితో పాటు గ్యారెంటీగా ఉన్న వారిని వేధింపులకు గురి చేయడంతో కొంత మంది వీరి ఆగడాలు భరించలేక గ్రామాలను వదిలి వెళ్లిన సంఘటనలువెలుగు చూస్తున్నాయి. కొడుకు చదువు.. కూతురి విదేశీ విద్య.. లేక పెళ్లి ఇంకా ఆసుపత్రి ఖర్చులు.. లేదా పెట్టుబడులు అవసరం ఏదైనా ఆదుకోడానికి మేమున్నా మంటూ అండగా నిలుస్తారు. అవసరం ఎంతైనా సాయం చేస్తారు. వారం వారం చెల్లించాలంటూ సున్నితంగా చెబుతారు. వారి వలలో పడితే ఇక అంతే సంగతులు.. చెల్లింపు ల్లో ఏమైనా తేడా జరిగిందా పరువు గోవిందా.. కుటుంబం పరువు నిండా గంగలోకలిసిపోయినట్టే. ఇలా పరు వుకు భయపడి మళ్లీ వాళ్లదగ్గరే ఇంకొంచం పెద్ద మొత్తంలో వడ్డీకి తీసుకుని ఆ అప్పును తీర్చడానికి కొత్త అప్పు చేస్తూ , వాటికి వడ్డీలు ఆపైన చక్రవడ్డీలు అపరాధ రుసుంలుచెల్లిస్తూ చివరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. సిబ్బంది వసూళ్ల కోసం తమ ప్రాంతాల్లోకి వస్తున్నారంటే నే రుణాలు తీసుకున్నవారు వణికిపోతు న్నారు.
ఇక్కడి గిరిజనంలో ఉన్న అమాయ కత్వాన్ని ఆసరా చేసుకుని తక్కువ వడ్డీ పేరిట అప్పులు అంటగట్టడం, ఆనక చెల్లించలేక సతమతమౌతున్న పరిస్థితుల్లో గ్రూపు లో ఉన్న ఇతరుల నుంచి వత్తిడి పెట్టడం.. పరువు తీస్తా మంటూ బెదిరింపులకు పాల్పడడం షరా మామూలుగా మారింది. గతం లో ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వం నిషేధం విధించి నప్ప టికీ.. మారిన పరిస్థితుల్లో సరళీ కరణ ముసుగులో మళ్లీ సూక్ష్మ రుణ సంస్థల వసూళ్ల పర్వం కొనసాగుతునే ఉంది. ఉన్నఫళం గా అప్పు ఇస్తుండ డమేసమాన్యులు వీరి పాలి ట పడి బలై పోవడానికి మార్గంగాఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులులేకుండానే కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతూ స్థానికంగా గ్రామాల్లో బోర్డులు పెట్టి మరీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం.