
`దోమల నివారణకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ప్రపంచ దోమల దినోత్సవాన్నిప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. దోమ.. పేరు లాగే చిన్నగా ఉంటుంది. కానీ, అది వేసే కాటుతో ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఆడ దోమ కుట్టి మలేరియా వ్యాధికి కారకురాలై.. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. వానాకాలం వస్తే చాలు.. విజృంభిస్తూ మనుషుల ప్రాణాలు తోడేస్తోంది. ఎన్ని రకాల కాయిల్స్, మందులు వాడినా, చివరికి దోమ తెరలు కట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఎలా ఉందో. అయితే, ఇక్కడో విషయం చెప్పుకోవాలి. దోమల నివారణకు ప్రభుత్వ చర్యలేకాక, ప్రతి ఒక్కరూ తమ చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. వీటి కట్టడి కోసమే ఈ రోజును ఏటా నిర్వహిస్తున్నారు.
అసలు ఆగస్టు 20నే ఎందుకంటే.. మలేరియా ఆడ అనాఫలిస్ దోమ కుట్టడంతో వ్యాపిస్తుంది. మల, అరియా అనే రెండు ఇటాలియన్ పదాల కలయికతో మలేరియా అనే పదం పుట్టింది. దీనికి చెడ్డగాలి అనే అర్థం వస్తుంది. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఈ రోజునే కనుగొన్నారు. దీంతో ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. రోనాల్డ్‌రాస్.. మలేరియా పరాన్న జీవికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. దోమ మనిషిని కుట్టినపుడు మలేరియా పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రిమి స్పోరో జాయిట్స్గా మారుతుంది. అవి విూరో జాయిట్స్గా మారి కాలేయం, ఎర్రరక్త కణాలలోకి ప్రవేశిస్తాయి. విూరోజాయిట్స్ దశలో మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.వేపనూనెతో దోమలను ఇలా తరిమికొట్టండి…వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు విూ దరిచేరకుండా ఉంటాయి.దోమలను తరిమికొట్టేందుకు సహజపద్ధతులను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేపనూనె దోమల పాలిట శత్రువు, మస్కిటో కాయిల్స్, స్ప్రేల బదులు వేపనూనెను వాడితే దోమలను నివారణ సహజ పద్ధతులతోనే సాధ్యం అవుతుందని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. అయితే వేపనూనెను దోమల నియంత్రణకు ఎలా వాడాలో చూద్దాం. ముందుగా వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు విూ దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వేపనూనే శరీరానికి ఎలాంటి హానీ కలిగించదు. అలాగే వేప నూనె ప్రభావంతో దోమలు ఆ ప్రదేశం నుంచి దూరమవుతాయ. అయితే ఈ విషయాన్ని ప్రముఖ జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించడం విశేషం..అంతేకాదు వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాండీ ప్రోటోజోల్ గుణాలు ఉన్నాయి. అలాగే వేపనూనెలో కాస్త దూదిని ముంచి ఇంట్లోని ప్రతి గదిలో నాలుగు మూలలా పెడితే దోమలు ఆ గదిలోకి రావు. అలాగే నిలువఉన్న నీళ్లలో వేపనూనెను చల్లితే దోమలు వృద్ధిని అరికట్టవచ్చు.